భారతదేశం, అక్టోబర్ 28 -- వైదిక జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. గ్రహాల గమనం ఆధారంగానే మనుషుల జాతకాలు, భవిష్యత్తు అంచనా వేయబడతాయి. ప్రస్తుతం ఆకాశంలో చోటు చేసుకుంటున్న గ్రహాల కదలికలు కోట్లాది మంది జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా సూర్యుడు, బుధుడు, శుక్రుడు, కుజుడు, గురువు వంటి ప్రధాన గ్రహాలు కీలక రాశుల్లో సంచరిస్తుండటం విశేషం.

ప్రస్తుతం తులా రాశిలో సూర్య, బుధ, శుక్రులు కలిసి సంచరిస్తుండగా, చంద్రుడి అధీపత్యంలో ఉన్న కర్కాటక రాశిలో కుజుడు, గురుడు పయనిస్తున్నారు. తులా రాశికి శుక్రుడు అధిపతి కావడంతో, ఆ రాశిలో మూడు శక్తివంతమైన గ్రహాలు కలవడం వల్ల త్రిగ్రహి యోగంతో పాటు బుధాదిత్య, లక్ష్మీనారాయణ రాజయోగాలు ఏర్పడుతున్నాయి.

మరోవైపు కర్కాటక రాశిలో గురుడు ఉచ్ఛ స్థితిలో, కుజుడు నీచ స్థితిలో ఉండటం ద్వారా 'నీచభంగ...