Hyderabad, అక్టోబర్ 7 -- నిహారిక కొణిదెల, నాగశౌర్య జంటగా నటించిన తెలుగు రొమాంటిక్ డ్రామా ఒక మనసు. ఈ సినిమా జూన్ 24, 2016లో థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడు 9 ఏళ్ల తర్వాత ఈటీవీ విన్ ఓటీటీ మూవీని ప్రీమియర్ చేయబోతోంది. ఇది ఒకరకంగా కాస్తా ఆశ్చర్యం కలిగించే విషయమే.

నిహారిక కొణిదెల మూవీ ఒక మనసు ఈటీవీ విన్ ఓటీటీలోకి అడుగుపెట్టబోతోంది. ఈ మూవీని గురువారం (అక్టోబర్ 9) నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆ ఓటీటీ వెల్లడించింది.

"ప్రతి మనసుకు దగ్గరయ్యే ఓ లవ్ స్టోరీ. ఒక మనసు మూవీ అక్టోబర్ 9 నుంచి స్ట్రీమింగ్ కానుంది. చూడండి" అనే క్యాప్షన్ తో ఈటీవీ విన్ ఓటీటీ ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా మూవీలోని లీడ్ రోల్స్ పోస్టర్ ను కూడా షేర్ చేసింది.

ఒక మనసు అనేది 2016లో వచ్చిన ఓ రొమాంటిక్ డ్రామా. ఈ సినిమాను జీవీ రామ రాజు డైరెక్ట్ చేశాడు. మధుర శ్రీధర్ రెడ్డి, కృష్ణ భాటియా...