భారతదేశం, జూలై 4 -- లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది బ్యాంక్ ఆఫ్ బరోడా. అర్హులైన అభ్యర్థులు బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిక వెబ్‌సైట్ bankofbaroda.in ద్వారా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్​ చేసుకోవచ్చు. ఈ దఫా రిక్రూట్​మెంట్​లో భాగంగా మొత్తం 2500 పోస్టులను బ్యాంక్​ ఆఫ్​ బరోడా భర్తీ చేయనుంది.

దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జులై 24, 2025 అని గుర్తుపెట్టుకోవాలి. అర్హత, ఎంపిక ప్రక్రియ సహా ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

లోకల్​ బ్యాంక్​ ఆఫీసర్స్​ పోస్టుకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం / విద్యాసంస్థ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. ఇందులో ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ (ఐడీడీ) కూడా ఉంటుంది.

అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటున్న రాష్ట్ర స్థానిక భాషలో (చదవడం, రాయడం, మాట్ల...