భారతదేశం, సెప్టెంబర్ 30 -- నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ సెప్టెంబర్ 30వ తేదీ ఎపిసోడ్ లో నా బుట్టలో నుంచి దొబ్బేసిన రొయ్యాలు ఇచ్చేసేయ్ అని మరో మహిళతో రాజ్ తల్లి కొరమీను సరోజ గొడవపెట్టుకుంటుంది. రాజ్ వెళ్లి గొడవ ఆపుతాడు. సూట్ లో రాజ్ ను చూసి తల్లి సరోజ షాక్ అవుతుంది. వాడు రాశి గల్లోడు, వాడికి పెద్ద సంబంధం రాసి పెట్టుందేనని సరోజ అంటుంది. చేపను పట్టడానికే వెళ్లానని రాజ్ ఇండైరెక్ట్ గా శ్రుతి గురించి చెప్తాడు. అందం, మాటకారితనంతో అమ్మాయిలను పడేయమని సరోజ అంటుంది.

శ్రుతి కనిపించకపోవడం కామాక్షి కంగారు పడుతుంది. అప్పుడే శ్రుతి వస్తుంది. అవమానం మర్చిపోవడానికే బయటకు వెళ్లానని శ్రుతి అంటుంది. శ్యామల వచ్చి కామాక్షి, శ్రుతిని తిడుతుంది. నేను వెళ్లిపోతానంటే అందరూ బతిమిలాడారు. కానీ మీరు వెళ్లిపోవాలని చూశారని శ్యామల అడుగుతుంది. చంద్రకళను టార్గెట్ చేసేలా...