భారతదేశం, సెప్టెంబర్ 26 -- నిన్ను కోరి సీరియల్ టుడే సెప్టెంబర్ 26వ తేదీ ఎపిసోడ్ లో పచ్చళ్లలో నీళ్లు కలిపావ్ కదా అని శ్రీధర్ తో అంటాడు అర్జున్. ఎందుకా పని చేశావ్? నేను సీసీటీవీ ఫుటేజీ చెక్ చేశా. నువ్వే కదా పచ్చళ్లు చెడగొట్టే ప్లాన్ వేశావని అర్జున్ అడుగుతాడు. నేను ఏ డ్యామేజీ చేయలేదని శ్రీధర్ నాటకమాడతాడు. అర్జున్ డోర్ క్లోస్ చేసి వచ్చి బెల్ట్ తో శ్రీధర్ ను చితకబాదుతాడు. నేనే చేశా సర్ అని ఒప్పుకొంటాడు శ్రీధర్.

విరాట్ రాగానే హగ్ చేసుకుని ఏడుస్తుంది శ్రుతి. మీ ఆవిడ కొట్టిందని చెప్తుంది. నీ సపోర్ట్ చూసుకుని చంద్రకళ రెచ్చిపోతుంది. పెద్దమ్మ మీదకు తిరగబడిందని లేని పోనివి అన్ని చెప్తుంది శ్రుతి. శ్రుతిని ఎందుకు కొట్టావని చంద్రను అడుగుతాడు విరాట్. నువ్వు చెయ్యి ఎత్తడం తప్పు చంద్ర. వాళ్లకు అవకాశం ఇచ్చేలా నువ్వు ప్రవర్తిస్తూనే ఉంటావు. మళ్లీ గొడవకు కార...