భారతదేశం, సెప్టెంబర్ 25 -- నిన్ను కోరి సీరియల్ టుడే సెప్టెంబర్ 25వ తేదీ ఎపిసోడ్ లో తన బాధ గురించి అర్జున్ కు చెప్తుంది చంద్రకళ. శాలిని మారిందని చెప్తుంది. జాబ్ పట్ల నేనే కాస్త అజాగ్రత్తగా ఉన్నానేమోనని చంద్ర అంటుంది. నేనే తప్పు ఎక్కడ జరిగిందో కనిపెట్టాలని అర్జున్ అనుకుంటాడు.

చంద్రకళ రాగానే బావతో ఎందుకు వెళ్లావని శ్రుతి అడుగుతుంది. బావతో నేను వెళ్లడం తప్పేమీ కాదు. పిన్నిని అడ్డుపెట్టుకుని ఎగిరెగిరి పడకు అని చంద్రకళ అంటుంది. ఓ వైపు బావ అంటే ప్రాణమంటావ్, మరోవైపు అర్జున్ వెంట పడతావు. సేవలు చేస్తావు. అర్జున్ అంత ముఖ్యమైనప్పుడు విరాట్ బావను వదిలేసి అతణ్నే తగులుకోవచ్చు కదా అని శ్రుతి అనగానే చంద్రకళ లాగి పెట్టి కొడుతుంది.

ఎందుకు కొట్టావని కామాక్షి, శ్యామల అడుగుతారు. బావ కంటే అర్జున్ ఎక్కువయ్యాడని అన్నందుకు కొట్టిందని శ్రుతి చెప్తుంది. నేను ఈ ఇంట...