భారతదేశం, సెప్టెంబర్ 23 -- నిన్ను కోరి టుడే సెప్టెంబర్ 23వ తేదీ ఎపిసోడ్ లో నా కూతురికి నొప్పులు వస్తున్నాయంటా అని బాబాయ్ అంటాడు. అర్జున్ ను నేను చూసుకుంటా మీరు వెళ్లండని చంద్రకళ చెప్తుంది. చంద్ర మీరు కూడా వెళ్లండని అర్జున్ అంటాడు. మీ ఫీవర్ కంట్రోల్ లో వచ్చేంతవరకూ ఉంటానని చంద్రకళ అంటుంది. తడిగుడ్డ తీసి నుదుటిపై పెడుతుంది.

అనుకున్నట్లుగానే గొడవ జరిగిందని శ్రీధర్ తో ఫోన్లో మాట్లాడుతుంది శాలిని. అర్జున్ ఇంటికి చంద్రకళ వెళ్లిందని శాలిని తెలుసుకుంటుంది. చంద్ర ఇంకా ఇంటికి రాలేదని శ్యామలను రెచ్చగొట్టి ఆఫీస్ కు వెళ్లకుండా చేయొచ్చని కామాక్షి, శ్రుతిని హెల్ప్ అడుగుతుంది శాలిని. శ్రుతిని సైలెంట్ చేసి చాడీలు చెప్తామని కామాక్షి వెళ్తుంది. చంద్ర పొద్దున వెళ్లి ఇంకా రాకపోవడం ఏంటీ? నీకన్నా మర్యాద ఉండాలి కదా. మాట్లాడగలిగేది నువ్వు ఒక్కదానివే. చెల్లదని వది...