భారతదేశం, సెప్టెంబర్ 19 -- నిన్ను కోరి సీరియల్ టుడే సెప్టెంబర్ 19వ తేదీ ఎపిసోడ్ లో చంద్రకళ బర్త్ డే సెలబ్రేట్ చేసేందుకు విరాట్ కు పర్మిషన్ ఇస్తుంది శ్యామల. నా ఒట్టు తీసి గట్టు మీద పెడుతున్నానని శ్యామల అనడంతో బావ హ్యాపీగా ఫీల్ అవుతాడు. నైట్ చంద్ర వచ్చే టైమ్ కు ఇళ్లంతా చీకటిగా ఉంటుంది. చంద్ర రాగానే ఒక్కసారిగా లైట్స్ ఆన్ అవుతాయి. డెకరేషన్ చూసి చంద్రకళ ఆశ్చర్యపోతుంది. అందరూ వచ్చి హ్యాపీ బర్త్ డే అని చెప్తారు.

ఇదంతా విరాట్ బావ ప్లాన్ అని చంద్రకళకు శాలిని చెప్తుంది. అప్పుడే హీరో ఎంట్రీ ఇస్తాడు. ఉదయం నుంచి విష్ చేయలేదని ఎదురు చూశావు కదా, ఇప్పుడు అర్థమైందా ఎందుకోనని విరాట్ అంటాడు. ఇంత సర్ ప్రైజ్ ప్లాన్ చేసేసరికి ఏం మాట్లాడాలో తెలియడం లేదు. క్రాంతి అమ్మను కూడా పిలవమని విరాట్ అంటే, అవసరం లేదని శ్యామల అంటుంది. ఫొటోస్ నేను తీస్తానని శ్రుతి అంటుంది....