భారతదేశం, సెప్టెంబర్ 17 -- నిన్ను కోరి సీరియల్ టుడే సెప్టెంబర్ 17వ తేదీ ఎపిసోడ్ లో శాలిని మీద ఎలా రివేంజ్ తీర్చుకోవాలా? అని శ్రుతి ఆలోచిస్తుంది. అక్వేరియంలో వేయమని తల్లి ఇచ్చిన గోళీలను శాలిని రూమ్ ముందు మ్యాట్ కింద వేస్తుంది శ్రుతి. దానిపై అడుగు వేసి జారి పడబోతున్న శాలినిని క్రాంతి పట్టుకుంటాడు. శాలిని, క్రాంతిని జగదీశ్వరి సీరియస్ గా చూస్తుంది. ఆ గోళీలు ఇక్కడెందుకు ఉన్నాయని శాలిని అడుగుతుంది.

ఈ గోళీలు నువ్వే కదా మ్యాట్ కింద పెట్టావని శాలిని అడుగుతుంది. అక్వేరియంలో వేయడానికి వెళ్తుంటే చేయి జారి కిందపడ్డాయి. అమ్మ వచ్చి మ్యాట్ వేసింది. శాలిని మ్యాట్ మీద కాలు వేసి జారింది. క్రాంతి ఉన్నాడు కాబట్టి సరిపోయింది లేదంటే శాలిని నడుం విరిగిపోయేదని శ్రుతి అంటుంది. ఈ పని నీ పనే అని తెలుసు శ్రుతి నీ సంగతి చెప్తానని శాలిని అనుకుంటుంది.

ఈ పిచ్చిది అద్దం...