భారతదేశం, సెప్టెంబర్ 16 -- నిన్ను కోరి సీరియల్ టుడే సెప్టెంబర్ 16వ తేదీ ఎపిసోడ్ లో నా బరువు, బాధ్యతలు మోయాల్సింది నువ్వు కదా బావ అని విరాట్ తో రొమాంటిక్ గా మాట్లాడుతుంది చంద్రకళ. రేపు నా బర్త్ డే బావ, నీకు గుర్తుందని అనుకుంటున్నా అని చంద్రకళ అనుకుంటుంది. ఏం ఆలోచిస్తున్నావ్ అని విరాట్ అడిగితే, ఏం లేదని వెళ్లిపోతుంది.

మరోవైపు బెడ్ సర్దుతున్న శాలినిని వెనకాల నుంచి వచ్చి క్రాంతి హగ్ చేసుకుంటాడు. నలుగురిలో నాతో రొమాంటిక్ గా మూవ్ అయితే నాకెలా ఉంటుంది? అమ్మకు విషయం తెలిసిందని అలా చేశావా? అని క్రాంతి ప్రశ్నిస్తాడు. ప్రేమ లేకపోయినా నటిస్తున్నానని అంటావా? నా మనసుకు ఏది అనిపిస్తే అది చేస్తా. ఓపెన్ గా ప్రేమను చూపించాలనుకున్నానని శాలిని అంటుంది. మళ్లీ మనం ప్రేమికులుగా ఉన్న రోజులు గుర్తొచ్చాయని క్రాంతి అంటాడు. శాలినిని ముద్దు పెట్టుకోబోతుండగా ఫోన్ మోగ...