Hyderabad, సెప్టెంబర్ 15 -- నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో తన గడువు గురించి అర్జున్‌కు చెబుతుంది చంద్రకళ. ఏదైనా సహాయం కావాలంటే అడగమని చెబుతాడు అర్జున్. ఇంటి పనులు పూర్తి కాలేదు. వెళ్తానని అంటుంది చంద్రకళ. మరోవైపు శ్రుతి కోసం కామాక్షి వెతుకుతుంది. ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వస్తుంది. వెతుకుతుంటే గెట్ దగ్గర శ్రుతి ఒక్క చెప్పు మాత్రమే దొరుకుతుంది.

వెళ్లి శాలినిని అడుగుతుంది కామాక్షి. శ్యామల వచ్చి అడిగితే శ్రుతికి ఏదో అయింది అని కామాక్షి టెన్షన్ పడుతుంది. శ్యామల, శాలిని పట్టించుకోరు. నా కూతురు ప్రమాదంలో ఉందంటే నమ్మరేంటి అని కామాక్షి అంటుంది. ఓ సినిమాలో ఓ ఇంట్లో కుటుంబంలోని డేంజరస్ పర్సన్ సీక్రెట్స్ బయటపెట్టినందుకు కిడ్నాప్ చేసి టార్చర్ చేస్తారు. తర్వాత చెరువులో పడింది అని శాలిని ఇన్‌డైరెక్ట్‌గా చెబుతుంది శాలిని.

అదంతా విని కామాక్షి భయపడిప...