Hyderabad, సెప్టెంబర్ 13 -- నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో చంద్రకళను విరాట్ పెళ్లి చేసుకోవడంపై నిందిస్తుంది శ్యామల. ఈ కాలం పిల్లలకు కుటుంబం, సంసారం తెలియట్లేదు. భార్యాభర్తల మధ్య ప్రేమే లేదు. పెద్ద వాళ్ల ప్రమేయం లేకుండానే పెళ్లి చేసుకుంటున్నారు. విడాకులు కూడా తీసుకుంటున్నారు అని జగదీశ్వరి అంటుంది.

దాంతో శాలిని తెగ భయపడిపోతుంది. అది చూసి శ్రుతి నవ్వుతుంది. విరాట్, శాలిని వెళ్లిపోతారు. చంద్రకళకు విరాట్ కాల్ చేస్తాడు. అర్జున్ కాల్ చేసి అర్జంట్‌గా రమ్మనేసరికి వచ్చేశాను అని చంద్రకళ అంటుంది. చేతికి అంత గాయం పెట్టుకుని స్కూటీ ఎలా నడిపావని అడుగుతాడు విరాట్. తగ్గిపోయిందిగా. రాత్రీ నువ్ పెట్టిన మందు కంటే చెప్పిన మాటలే తగ్గేలా చేశాయంటుంది చంద్రకళ.

తర్వాత స్టాఫ్ ఎవరు లేకపోవడంతో షాక్ అవుతుంది చంద్రకళ. ఇంతలో అందరూ వచ్చి కంగ్రాట్స్ అని చెబుతారు. ...