భారతదేశం, సెప్టెంబర్ 10 -- నిన్ను కోరి సీరియల్ టుడే సెప్టెంబర్ 10వ తేదీ ఎపిసోడ్ లో హాస్పిటల్ బెడ్ పై ఉన్న రఘురాం ఆక్సీజన్ మాస్కును తీసేస్తుంది శాలిని. శ్వాస అందక రఘురాం ప్రాణాలతో పోరాడతాడు. బయట జగదీశ్వరి బాధ పడుతుంది. నేను ఆయన దగ్గరే ఉండి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదు అని జగదీశ్వరి ఏడుస్తుంది. నేను ఆయన దగ్గరే ఉంటా అని ఐసీయూ లోపలికి వెళ్తానని జగదీశ్వరి అంటుంది. డాక్టర్ ను అడిగి లోపలికి వెళ్తారు. దిండు తీసుకుని ముఖంపై పెట్టాలని శాలిని అనుకుంటుంది. కానీ ఆ లోపే అందరూ లోపలికి రావడంతో ఆక్సీజన్ మాస్కు పెట్టి వెళ్లిపోతుంది.

చంద్రకళను బయటకు వెళ్లమంటుంది శ్యామల. వదినకు క్రాంతి సపోర్ట్ చేస్తాడు. తప్పంతా నాదే మెడిసిన్ వేయడానికి చంద్ర బదులు నేను వెళ్లాల్సిందని జగదీశ్వరి బాధ పడుతుంది. చంద్రను బయటకు పంపిస్తారు. రఘురాం కళ్లు తెరవడంతో అందరూ సంతోషపడితే, శాలి...