భారతదేశం, మార్చి 5 -- నిన్ను కోరి సీరియల్ టుడే మార్చి 5 ఎపిసోడ్ లో.. విరాట్ ను చూడకుండా రెండు గంటలు ఉండటం ఎంత కష్టమోనని శ్యామలతో చంద్రకళ చెప్తుంది. అలా అయితే పచ్చళ్ల బిజినెస్ మానేసి విరాట్ తో ఆఫీస్ కు వెళ్లొచ్చు కదా అని కామాక్షి అంటుంది. వెళ్లేదాన్ని పిన్ని, కానీ వర్క్ ఎక్కువగా సైట్ లో ఉంటుంది. ఎండలో ఉంటే కందిపోతానని మా ఆయన వద్దన్నాడని చంద్ర సిగ్గు పడుతుంది.

ఎక్కడికి వెళ్తున్నావని కామాక్షి అడగ్గానే శాలిని కంగారు పడుతుంది. ఎందుకు అడుగుతున్నావ్? తనకు బిజినెస్ ఉండదా అని శ్యామల అంటుంది. మాకు గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్తున్నావ్? అని చంద్రను శ్యామల అడుగుతుంది. అప్పుడే అర్జున్ నుంచి చంద్రకు కాల్ వస్తుంది. తేజ్ లో బెటర్ మెంట్ కనిపిస్తోంది. హెల్త్ కండీషన్ లో మార్పు వచ్చింది. ట్రీట్మెంట్ ఇస్తే క్యూర్ అవుతుందని డాక్టర్లు చెప్పారని అర్జున్ చెప్తాడు.

త...