భారతదేశం, ఫిబ్రవరి 27 -- నిన్ను కోరి సీరియల్ టుడే ఫిబ్రవరి 27 ఎపిసోడ్ లో.. ఎందుకు నాకు అమ్మలా యాక్ట్ చేశావ్? నేను చచ్చిపోవద్దనా? అని ఏడుస్తూ చంద్రకళను తేజు గట్టిగా పట్టుకుంటుంది. ఇన్ని రోజులు నువ్వు నాకు అమ్మలా ఉన్నందుకు చాలా థ్యాంక్స్ అమ్మ. నువ్వు చూపించిన కేరింగ్ కు అమ్మంటే నీలా ఉంటుందని అర్థమైంది. నిజంగా నన్ను కూతురిలాగే చూసుకున్నావని తేజు అంటుంది.

నువ్వు చాలా గ్రేట్ అమ్మ. నీ లవ్ ఎప్పటికీ మర్చిపోనని తేజు అంటుంది. దీంతో తన ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయిందని శాలిని ఫ్రస్టేట్ అవుతుంది. ఇక నువ్వు యాక్ట్ చేయాల్సిన అవసరం లేదమ్మా. నేను నిన్ను ఇబ్బంది పెట్టనని తేజు అంటుంది. నిజాన్ని పాప యాక్సెప్ట్ చేయడం చాలా గొప్ప విషయమని క్రాంతి అంటాడు.

పాపకు నిజం ఎలా తెలిసింది? అని శ్యామల అడగడంతో శాలిని కంగారు పడుతుంది. పార్కులో తేజుకు ఎవరో చెప్పారని అర్జున్ చెప...