భారతదేశం, ఫిబ్రవరి 25 -- నిన్ను కోరి సీరియల్ టుడే ఫిబ్రవరి 25 ఎపిసోడ్ లో.. విరాట్ గాయాలతో ఇంటికి రావడంతో అందరూ కంగారు పడతారు. గుడిలో పూజ చేయిస్తున్నప్పుడు ఎవరో నా మీద అటాక్ చేశారు చంద్ర. ఎందుకు అటాక్ చేశారని శ్యామల అడుగుతుంది. తెలియదు అత్త కానీ నన్ను చంపడానికి వచ్చారు. పోలీసులకు ఇన్ఫామ్ చేశానని విరాట్ చెప్తాడు.

శాలిని తెగ టెన్షన్ పడుతుంది. శాలినిని చూసి క్రాంతి డౌట్ పడతాడు. వెంటనే బిజినెస్ శత్రువులే కావొచ్చని శాలిని డైవర్ట్ చేయాలని చూస్తుంది. చంద్రకళ బాధపడుతుంది. శాలిని బయటకు వచ్చి తల్లికి కాల్ చేస్తుంది. నువ్వు చెప్పిందేంటీ, జరిగిందేంటీ? శవంలా రావాల్సిన బావగారు చిన్న గాయంతో వచ్చాడు. నలుగురు కలిసి ఒక్కడిని ఏం చేయలేకపోయారని కోపంతో శాలిని కాల్ కట్ చేస్తుంది.

శాలిని దగ్గరకు వచ్చిన క్రాంతి అన్నయ్య మీద నువ్వే అటాక్ చేయించావని అంటాడు. నీ మీద ...