భారతదేశం, నవంబర్ 10 -- నిన్ను కోరి సీరియల్ టుడే నవంబర్ 10 ఎపిసోడ్ లో రఘురాం కనిపించకపోవడంతో అందరూ కంగారు పడతారు. అప్పుడే వచ్చిన రఘురాం వాకింగ్ కు వెళ్లానని చెప్తాడు. తిరిగి వద్దామంటే ఇల్లు గుర్తుకు రాలేదని అంటాడు రఘురాం. మరోసారి ఒంటరిగా వెళ్లొద్దని రఘురాంను కోరతారు.

కాఫీ తీసుకురమ్మని చంద్రకళకు చెప్పిన విరాట్, ఆమె గదిలోకి రాగానే వెనకాల నుంచి వచ్చి వాటేసుకుంటాడు. పొద్దున్నే సరసాలు ఏంటీ? అని చంద్ర అడుగుతుంది. ఇదే కాఫీని షేర్ చేసుకుని తాగుదామంటాడు విరాట్. సాసర్ లో కాఫీ పోసుకుని విరాట్, చంద్ర రొమాంటిక్ గా తాగుతారు. శ్రుతి అదంతా చూసి నా బేబీతో కలిసి నేను కూడా ట్రై చేయాలని అనుకుంటుంది.

పని మనిషిని పట్టుకుని జగదీశ్వరి అని మాట్లాడతాడు రఘురాం. అందరూ వచ్చి అది మన ఇంటి పని మనిషి అని చెప్తారు. తనను చూసి నువ్వు అనుకున్న జగదీశ్వరి అని అంటాడు రఘురాం. ద...