భారతదేశం, డిసెంబర్ 16 -- కార్తీక దీపం 2 టుడే డిసెంబర్ 16 ఎపిసోడ్ లో చంద్ర గురించి మాయ మాటలు చెప్తూ క్రాంతిలో విషం నింపుతూనే ఉంటుంది శాలిని. ఆ మహాతల్లి కారణంగానే అన్నదమ్ముల మధ్య డిఫరెన్స్ వచ్చాయి శాలిని. నిజంగా అన్నయ్య అన్నట్లు పంతాలు, పట్టింపులు మర్చిపోయి క్షణాల్లో కలిసిపోయే రోజులు మళ్లీ వస్తే బాగుండని క్రాంతి అంటాడు. బయట నుంచి అందంతా విన్న విరాట్ అలాంటి రోజులు వస్తాయని అనుకుని వెళ్లిపోతాడు.

గుడిలో రాజ్, శ్రుతి పెళ్లి జరుగుతుంది. రాజ్ తొందరపెడుతుంటే, శ్రుతి మాత్రం నెమ్మదిగానే చేయమంటుంది. శాలినికి మధు ఫోన్ చేసి ముహూర్తానికి ఇంకా గంట టైమ్ ఉందని చెప్తాడు. కాసేపు ఆగి చంద్రకళకు కాల్ చేసి చెప్పమంటుంది శాలిని. మరోవైపు ఇంట్లోనే ఉన్న శ్రుతి ఫోన్ కు ఫ్రెండ్ కాల్ చేసి గుడిలో సీక్రెట్ గా పెళ్లి చేసుకుంటున్నావ్ కదా అని చెప్తుంది. ఆ మాటలు కామాక్షి విన...