Hyderabad, జూలై 7 -- నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో చంద్రకళ గీసిన ఫొటోను చూస్తూ విరాట్ మురిసిపోతాడు. అమ్మ ప్రేమని కలవరిస్తూ చాలా ప్రేమగా ఫోటోని చూస్తూ విరాట్ ఉంటుండగా ఇంతలో చంద్రకళ అక్కడికి వచ్చి చూస్తుంది.

చూసావా బావ తల్లి ప్రేమను ఎవరు ఈ ప్రపంచంలో తీసివేయలేరు. నేను ఈ ఇంటిని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాను. నేను ఈ ఇంటి మీద పెత్తనం చెలాయించడానికి ఇక్కడికి రాలేదు బావ. మిమ్మల్ని అందరిని జాగ్రత్తగా చూసుకోవడానికి వచ్చాను అని చంద్రకళ చెబుతుంది.

విరాట్ కాస్తా ముభావంగా ఉంటాడు. ఇదే సమయంలో చంద్రకళ వేలికి చిన్న గాయం అవుతుంది. దాంతో విరాట్ పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైంది అని అడిగి గాయమైన దగ్గర ఆయింట్‌మెంట్‌ రాస్తూ ట్రీట్‌మెంట్ ఇస్తాడు. చూసావా బావ ప్రేమ అనేది చూపిస్తే రాదు గుండెల్లో నుంచి పుట్టాలి. నాకు గాయం అయిందంటే చంటి పిల్లాడిలా పరుగెత్తుకొంటూ వ...