Hyderabad, జూలై 5 -- నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ఇంట్లో చంద్రకళ, శాలిని మధ్య పోటీ నడుస్తుంటుంది. శ్యామల అందరిని పిలిచి మూడో పోటీ నిర్వహించబోతున్నాను. అందులో మీరు మీ భర్తలను ఇంప్రెస్ చేయాలి అని చెబుతుంది. దానికి శాలిని అంగీకరించి ఎలాగో క్రాంతి నా వైపు ఉన్నాడు. కాబట్టి ఏ పని చేసినా నాకు తన సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఈ పోటీలో నేనే గెలుస్తానని సంబరపడిపోతూ ఉంటుంది.

ఇక చంద్రకళ మాత్రం విరాట్ తనకు సపోర్ట్‌గా లేడు కాబట్టి నేను ఓడిపోతానేమో అని కాస్తా భయపడుతుంది. తర్వాత శ్యామల ఉండి మీరు ఏదైనా చేయండి. మీ భర్తలను మాత్రం ఇంప్రెస్ చేయండి అని గదిలోకి పంపిస్తుంది. గదిలోకి వచ్చిన శాలినికి డ్రాయింగ్ బొమ్మలు గుర్తుకొచ్చి వాళ్ల బొమ్మలను ఒక చార్ట్ మీద చిత్రీకరిస్తుంది. ఆ చిత్రీకరించిన బొమ్మతో క్రాంతి ఇంప్రెస్ అవ్వాలని అనుకుంటుంది శాలిని.

చంద్రకళకి ఏమి ...