భారతదేశం, జూలై 29 -- నిన్ను కోరి సీరియల్ టుడే జూలై 29వ తేదీ ఎపిసోడ్ లో విరాట్ కు థ్యాంక్యూ చెప్తుంది చంద్రకళ. నిజం తెలుసుకుని పిన్ని ద్వేషించడంతో బాధ కలిగింది. నువ్వు గడువు ఇవ్వాలనే మాటతో కొండంత ధైర్యం వచ్చింది. ఇదే అవకాశాన్ని వాడుకుని వదిలేసుకుని ఉండొచ్చు. కానీ ఛాన్స్ ఇచ్చావు అని చంద్రకళ అంటుంది. పంపించిన తర్వాత తప్పు చేయలేదని తెలిస్తే ఆ గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. నేను నిన్ను పూర్తిగా నమ్మాలంటే నువ్వు ఇందులో గెలిచి తీరాలని విరాట్ అంటాడు. నువ్వు నమ్మినప్పుడే సగం గెలిచాను బావ. నువ్వు ఇలాగే బూస్టప్ ఇస్తే మామయ్య ను త్వరగా కోలుకునేలా చేసి గెలుస్తానని చంద్ర అంటుంది.

శ్యామలకు నిజం తెలిస్తే చంద్రకళ వెళ్లిపోతుంది. మనశ్శాంతి ఉంటుందనుకుంటే మరో నెల రోజులు తప్పదని కామాక్షి, శ్రుతి మాట్లాడుకుంటారు. గదిలో వెళ్తున్న చంద్రకళను ఆపి, మా వదిన వెళ్లవద్దని చెప్...