Hyderabad, జూన్ 28 -- నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో చంద్రకళ బెడ్ రూమ్‌కి వస్తుంది. నువ్వెందుకు ఇలా చేస్తున్నావు. ఇప్పుడు ఇప్పుడే కోలుకునే నాన్నని ఇలా కింద పడేసావు ఎందుకు అంత కక్ష సాధింపులాగా చేస్తున్నావ్ అని చంద్రకళను విరాట్ తిడతాడు. దానికి చంద్రకళ నేను కావాలని చేయలేదు అని చాలా చెప్పి చూస్తుంది.

అయినా కానీ, చంద్రకళ ఎంత చెప్పినా విరాట్ వినడు. దాంతో చంద్రకళ తప్పు చేయకపోయినా తప్పు చేసినట్టే అందరి ముందు దోషిగా కనిపిస్తుంది. శ్యామలతో సహా అందరూ చంద్రకళను తిట్టేసరికి విరాట్ కూడా గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. ఇక శృతి శాలిని కామాక్షి ముగ్గురు కలిసి ఆ చంద్రకళని ఇంట్లో నుంచి ఎలా పంపించేయాలి అని ప్లాన్ చేస్తుంటారు.

అక్కడ శాలిని వాళ్లిద్దరితో ఆ ప్లాన్ మొత్తం చెబుతుంది. వాళ్లు కూడా ఎగ్జైట్ అయిపోయి ఇక రేపు చంద్రకళని ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తు...