Hyderabad, జూన్ 27 -- నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో కామాక్షి, శ్రుతి పికిల్స్ కొన్న కస్టమర్ ఇంటికి వస్తుంది. మోడ్రన్ పికిల్స్ మీవేనా. చాలా డిఫరెంట్ కాంబినేషన్‌లో పచ్చళ్లు చేశారు అని అడుగుతుంది. అవును, కలబంద కాకరకాయ. అది ప్రత్యేకంగా షుగర్ పేషంట్స్ కోసం చేశాం అని కామాక్షి చెబుతుంది.

మా ఆయనకు షుగర్ లేదు కానీ మీరు పెట్టిన పచ్చడి తిని హాస్పిటల్ పాలయ్యారు అని లేడి కస్టమర్ చెప్పి కామాక్షి, శ్రుతిని తిడుతుంది. కామన్ సెన్స్ వాడి అయినా పచ్చళ్లు పెట్టండి. లేదా ఇంకోసారి ఇలాంటి పచ్చళ్లు పెడితే ఊరుకోను అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది కస్టమర్. దాంతో ఇక నుంచి అయినా పనికిరాని పచ్చళ్లు పెట్టి వాళ్లు వీళ్లతో తిట్టించుకోవద్దని శ్యామల అంటుంది.

పచ్చళ్ల వ్యాపారం దెబ్బతినడంతో కామాక్షి, శ్రుతి బాధలో ఉంటారు. ఇద్దరు చిరాకు పడుతూ ఉంటారు. ఇంతలో అక్కడికి వి...