Hyderabad, జూన్ 26 -- నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో బెడ్ రూమ్‌లోకి చంద్రకళ వస్తే నువ్ పడుకోవాల్సింది సోఫాపై అని అంటాడు విరాట్. సోఫాపై ఒకవైపుకే పడుకోలేకపోతున్నాను అని చంద్రకళ అంటుంది. కానీ, విరాట్ వినడు. దాంతో సోఫాపై నీళ్లు పోసి బెడ్ మీద పడుకుందామనుకుంటుంది చంద్ర. బాటిల్ పట్టుకుని సోఫాపై చంద్ర నీళ్లు పోస్తుంటే విరాట్ వచ్చి గ్లాస్ పట్టుకుంటాడు.

నాకు తెలిసే ఇలాంటివి వింత ప్రయోగాలు చేస్తావని అని విరాట్ అంటాడు. ఇద్దరు అలాగే గొడవ పడతారు. ఆ మాటలన్నీ విన్న శ్యామల ఓహో వీళ్ల మధ్య ఏం జరగలేదన్నమాట. చెబుతా అని అనుకుంటుంది. మరుసటి రోజు ఉదయం శ్యామల అత్తయ్య లేకపోతే నిన్ను మెడపట్టి బయటకు గెంటేసేవాన్ని అని విరాట్ అన్న మాటలు తలుచుకుంటుంది శ్యామల.

ఇంతలో చంద్ర వచ్చి త్వరగా లేచారు అని అడుగుతుంది. నిద్ర పట్టలేదని శ్యామల అంటే హోమ్ సిక్ అయినట్లున్నారు. మ...