Hyderabad, జూన్ 19 -- నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో సారీ చంద్రకళ అని శ్యామల అంటుంది. చంద్రకళను విరాట్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇంటి పనులు చక్కగా చేస్తుంది. అది చాలు. తన పుట్టింటి వాళ్ల గురించి అవసరం లేదు. వాళ్లే వచ్చి కలుస్తారు. అంతవరకు ఎవరి పనులు వాళ్లు చూసుకుంటే మంచిది. అనవసరంగా చంద్రకళను బాధపెట్టే పని చేస్తే నేను ఊరుకోను అని శ్యామల వెళ్లిపోతుంది.

హమ్మయ్య అని బతికిపోయినట్లు చంద్రకళ ఊపిరి తీసుకుంటుంది. కామాక్షి నీతో మాట్లాడాలి నీ కూతురుని తీసుకుని రా అని జగదీశ్వరి వెళ్లిపోతుంది. హమ్మా బతికించావ్ దేవుడా. ఎక్కడ నిజం తెలిసిపోతుందా అని భయపడ్డాను అని చంద్రకళ అనుకుంటుంది. శ్యామలకు పనిగట్టుకుని ఎందుకు చంద్రకళ గురించి చెప్పాలని చూస్తున్నావ్ అని తిడుతుంది జగదీశ్వరి.

నీకు చివరిసారిగా చెబుతున్నా చంద్రకళ పుట్టింటి గురించి శ్యామలకు తెల...