భారతదేశం, జూలై 28 -- నిన్ను కోరి సీరియల్ టుడే జులై 28వ తేదీ ఎపిసోడ్ లో సుభద్ర కూతురు చంద్రకళ అని తెలుసుకున్న శ్యామల ఊగిపోతుంది. విరాట్ ద్వేషంతో తాళి కట్టడం ఏంటీ అని కామాక్షిని అడుగుతుంది. చంద్ర ముందుగా విరాట్ ఆఫీస్ లో జాయిన్ అయింది. విరాట్ చంద్రను ప్రేమించాడు. రెండు కుటుంబాలను కలపాలనే నేపథ్యంలో వరదరాజులు కుటుంబాన్ని తీసుకొచ్చింది. కానీ అన్నయ్యకు వాళ్ల పన్నాగం తెలిసిపోయింది. వదినకు నిజం చెప్పేస్తాడని అన్నయ్యకు యాక్సిడెంట్ చేయించాడు వరదరాజులు. చంద్ర ఆ నిజం దాచింది. ఆ కారణంతో విరాట్ ద్వేషించి తాళి కట్టాడని కామాక్షి క్లియర్ గా చెప్తుంది.

అదంతా నిజమే పిన్నీ. మామయ్యకు అలా జరిగిందన్న ఒక్క విషయం తప్పా మీరు ఇన్ని రోజులుగా నన్ను చూస్తున్నారు. నాలో స్వార్థం కనిపించిందా? అని శ్యామలను అడుగుతుంది చంద్ర. నువ్వు కనిపించనివ్వలేదు. ఎంత మోసం చేశావ్. నీ కోస...