భారతదేశం, జనవరి 20 -- నిన్ను కోరి సీరియల్ టుడే జనవరి 20 ఎపిసోడ్ లో డాక్టర్ ప్రకాష్, రఘురాంతో చంద్రకళ వెళ్తుంది. మరోవైపు జల్ రాజ్, సరోజా ఇంటికి వచ్చేసరికి తాళం ఉంటుంది. రాజ్ ఫోన్ చేసినా శ్రుతి లిఫ్ట్ చేయదు. పోతే పోనీ నాకు భారం తగ్గిందని సరోజా అంటుంది. అత్త కామాక్షికి ఫోన్ చేస్తాడు రాజ్. అత్త నీ కూతురు వచ్చిందా? అని రాజ్ అడుగుతాడు.

నా కూతురు నీతో మూడు చెరువుల నీళ్లు తాగిస్తుంది వెయిట్ చేయ్. గిలగిల కొట్టుకుని రోజు దగ్గర్లోనే ఉంది. అయిపోయార్రా నీ చాప్టర్ క్లోజ్ అని కాల్ కట్ చేస్తుంది కామాక్షి. లాకర్ లో క్రాంతికి టాబ్లెట్స్ దొరుకుతాయి. అప్పుడే విరాట్ వస్తాడు. శాలినికి ఇంత సీక్రెట్ గా టాబ్లెట్స్ దాచాల్సిన అవసరం ఏముందని విరాట్ అడుగుతాడు. శాలినికి ఏమైనా ప్రాబ్లెం ఉందా? నీ దగ్గర ఏమైనా దాస్తుందేమోరా. నువ్వు బాధపడతావని సీక్రెట్ ట్రీట్మెంట్ తీసుకుంట...