భారతదేశం, ఆగస్టు 26 -- నిన్ను కోరి సీరియల్ టుడే ఆగస్టు 26వ తేదీ ఎపిసోడ్ లో ఆన్ లైన్ లో శ్రుతి కొన్న బట్టలపై శాలిని ఫైర్ అవుతుంది. నువ్వు ఇచ్చిన డబ్బులు ఉన్నాయి కదా అని శ్రుతి అంటుంది. ఈజీగా మనీ చేతికి వచ్చిందని ఖర్చు పెడతారా? బిజినెస్ చేయడానికి డబ్బులు ఎలా వస్తాయని శాలిని అడుగుతుంది. నువ్వు ఉన్నావు కదా అని శ్రుతి అంటుంది. ఇన్నేళ్లు వచ్చినా మీ అమ్మ కొంగు పట్టుకుని తిరుగుతున్నావు. విరాట్ బావను పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కూడా సొంతంగా వచ్చింది కాదు. ఇప్పటికీ బావ మీద ఇష్టం ఉందో లేదో తెలియదు అని శాలిని మండిపడుతుంది.

ఈ ఇంటికి నువ్వే రాంగ్ సెలక్షన్. అందుకే కదా క్రాంతి విడాకులు ఇవ్వాలనుకున్నాడు. ఆ విషయం తెలిసి కూడా బయట పెట్టడం లేదు.లేదంటే నువ్వు ఈ ఇంట్లో ఉండేదానివా? అని శ్రుతి అనగానే శాలిని లాగిపెట్టి కొడుతుంది. నీ నోరు ఎలా నొక్కాలో? నా స్థానం ఎలా ...