భారతదేశం, ఆగస్టు 20 -- నిన్ను కోరి సీరియల్ టుడే ఆగస్టు 20వ తేదీ ఎపిసోడ్ లో కామాక్షి, శ్రుతి చాటుగా వింటున్నారని చంద్రకళతో సీరియస్ గా మాట్లాడతాడు విరాట్. అది అర్థం చేసుకోని చంద్ర ప్రశ్నలు అడుగుతుంది. నువ్వు గెలిస్తే అప్పుడు ప్రేమ పుడుతుందని అంటాడు విరాట్. గెలుస్తాను బావ, వ్రతం నేను సంతోషంగా చేయాలని నువ్వు అనుకుంటే ఈ డ్రెస్ వేసుకో అని వెళ్లిపోతుంది చంద్ర. చంద్ర, అత్తయ్య మధ్య ఇరుక్కుపోయానని విరాట్ అనుకుంటాడు.

క్రాంతి వ్రతంలో వేసుకోబోయే కలర్ కాంబినేషన్ ఇదే డ్రెస్ లు చూపిస్తుంది శాలిని. నువ్వు వదినను ఎందుకు సపోర్ట్ చేయలేదు? ఇంకా ద్వేషం ఉందా? అని ప్రశ్నిస్తాడు క్రాంతి. నా సపోర్ట్ ఫుల్ గా చంద్రకే కానీ సీక్రెట్ గా. ఎందుకంటే శ్యామల పిన్ని ఊరుకోదు. వ్రతం రెండు జంటలు బాగా చేసుకోవాలి. చంద్ర ప్రూవ్ చేసుకోవాలి. మనం హ్యాపీగా ఉండాలని క్రాంతిని హగ్ చేసుక...