భారతదేశం, ఆగస్టు 19 -- నిన్ను కోరి సీరియల్ టుడే ఆగస్టు 19వ తేదీ ఎపిసోడ్ లో నన్ను అర్థం చేసుకునే మనసు మీకుంది కాబట్టి మీ కోపాన్ని ఇష్టంగా భరిస్తా అని జగదీశ్వరితో చంద్రళ అంటుంది. పొద్దున కాళ్ల నొప్పులు అంటూ బాధపడుతుంది శ్యామల. నువ్వు ఎంత ప్రయత్నించినా చంద్రను విరాట్ సీక్రెట్ గా సపోర్ట్ చేస్తూనే ఉన్నాడు. నీ ముందు నటిస్తున్నాడని శ్యామలతో కామాక్షి అంటుంది. మనల్ని పరోక్షంగా ఆ చంద్ర టార్చర్ చేస్తూనే ఉందని కామాక్షి చెప్తుంది. విరాట్ నాటకాన్ని బయటపెట్టి తీరుతానని శ్యామల అంటుంది.

అప్పుడే శ్రుతి వచ్చి క్రాంతితో కలిసి శాలిని వరలక్ష్మి వ్రతం చేస్తుందటా అని నవ్వుతూ చెప్తుంది.శాలినిలో మార్పు వచ్చిందే అని కామాక్షి అంటుంది. శాలిని చేయడం వింతే కదా పెద్దమ్మ అని శ్రుతి వెటకారంగా మాట్లాడుతుంది. మీరెంత వెటకారంగా మాట్లాడిన ఇంటి కోడలికే వ్రతం చేసే అర్హత ఉంటుంది...