భారతదేశం, ఆగస్టు 13 -- నిన్ను కోరి టుడే ఆగస్టు 13వ తేదీ ఎపిసోడ్ లో రోడ్డు మీద విరాట్, చంద్రకళ కొబ్బరి బోండాలు తాగడంపై శ్రుతి రచ్చ చేస్తుంది. శ్యామల కూడా ప్రశ్నిస్తుంది. నీకు సైట్ వచ్చినట్లు ఉంది. ఎవరిని చూసి ఎవరు అనుకున్నావో, కళ్ల డాక్టర్ కు చూపించాలని విరాట్ అంటాడు. ఈ పిచ్చిదాని మాటలు పట్టుకుని నవ్వు నన్ను అనుమానిస్తున్నావా అత్తా? శ్రుతి చెప్పేది నిజమని ఏంటీ గ్యారెంటీ. ప్రూఫ్ ఉందా? మా ఇద్దరి ఫొటో తీశావా? నిజం నిజం అని వాగేస్తే అత్త నమ్మేస్తుందా? అత్త నీలా పిచ్చిది కాదు. చాలా తెలివైంది అని తెలివిగా ఎస్కేప్ అవుతాడు విరాట్.

క్రాంతికి డిజైన్లు చూపిస్తుంది శాలిని. బల్క్ ఆర్డర్ వచ్చిందని డిజైన్లు వేశానని చెప్తుంది. నన్ను క్షమించావు చాలా హ్యాపీ అని శాలిని అంటుంది. ఇంట్లో ముఖ్యంగా చంద్ర వదినకు ఎలాంటి ఇబ్బంది రాకూడదని క్రాంతి అంటే.. చంద్ర ఇంటికి...