భారతదేశం, ఆగస్టు 12 -- నిన్ను కోరి సీరియల్ టుడే ఆగస్టు 12వ తేదీ ఎపిసోడ్ లో మామయ్య ఆరోగ్యం గురించి నాటు వైద్యుడితో మాట్లాడుతుంది చంద్రకళ. ఫలితం రావాలంటే మనసు కూడా శరీరానికి సహకరించాలి. అతను కోలుకోవాలంటే జీవచ్ఛవంలా ఉండాలనే ఆలోచన లేకుండా చేయాలి. అందరిలాగే అతనితో ఉండాలని చెప్పి మరో మందు ఇచ్చి పంపిస్తాడు నాటు వైద్యుడు.

నీకు, శాలినికి మధ్య ఏం జరుగుతుందో నాకు తెలియదు అనుకున్నవా? మాకు ఒక్కరికైనా చెప్పాలని అనిపించలేదా? ఫ్యామిలీ ఉన్నది దేనికీ? అని క్రాంతిని అడుగుతుంది కామాక్షి. నువ్వు శాలినికి డివోర్స్ నోటీస్ పంపించావని తెలుసని చెప్తుంది. శాలిని ఏ తప్పు చేసిందనేది క్రాంతి నోటితోనే తెలుసుకుంటుంది కామాక్షి. అసలు విషయం తెలుసుకుని కామాక్షి షాక్ అవుతుంది. ఈ విషయంలో మీరెందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు అత్తయ్య. తను మారితే కలిసి కాపురం చేసుకుంటాం. లేదంటే ఎవరి...