భారతదేశం, అక్టోబర్ 6 -- నిన్ను కోరి సీరియల్ టుడే అక్టోబర్ 6 ఎపిసోడ్ లో శ్వేత మీ సమస్య తీరిపోయింది కదా ఇంకా ఇక్కడే ఉంటారా? వెళ్లిపోతారా? అని శ్రుతి అడుగుతుంది. అతిథిని అలా అడగడం సంస్కారం కాదని చంద్రకళ అంటుంది. ఈ రోజు ఈవెనింగ్ వెళ్లిపోతానని శ్వేత అంటుంది. అలా అయితే మీ కోసం స్పెషల్ లంచ్ ప్రిపేర్ చేస్తా మీకు ఏది ఇష్టం చెప్పమని చంద్ర అడుగుతుంది. అప్పుడు తనకు ఫిష్ అంటే చాలా ఇష్టమని విరాట్ చెప్తాడు.

నువ్వు ఇంట్రెస్టెడ్ గా ఉన్నావు కాబట్టి చెప్పా. అంతకంటే ఎక్కువ ఊహించుకోకు అని చంద్రకళతో అంటాడు విరాట్. మా వదిన ఫిష్ కర్రీ అదరగొడుతుంది మీరు టేస్ట్ చేయాల్సిందేనని శ్వేతతో క్రాంతి అంటాడు. శ్రుతి ఖాళీగా ఉంటుంది కదా వెళ్లి ఫిష్ తెస్తుందని క్రాంతి చెప్తాడు. డ్రెస్ డిజైన్ పేరు చెప్పి శ్రుతిని వెళ్లేలా ఒప్పిస్తాడు. బావ మరి నాకేది ఇష్టమో చెప్పు అని అడుగుతుంద...