భారతదేశం, అక్టోబర్ 3 -- నిన్ను కోరి సీరియల్ టుడే అక్టోబర్ 3వ తేదీ ఎపిసోడ్ లో చేపలు పులుసు టేస్ట్ గురించి కార్లో వెళ్తూ శ్రుతి, కామాక్షికి చెప్తాడు జల రాజ్. శ్రుతిని ఫ్లర్ట్ చేస్తూనే ఉంటాడు రాజ్. అప్పుడే బిచ్చగాడు వస్తే బిల్డప్ కోసం రాజ్ తన పర్సులోనుంచి రూ.500 తీసి వేస్తాడు. శ్రుతి వెళ్లిపోగానే రూ.500 మళ్లీ తీసేసుకుంటాడు రాజ్.

ప్రమోద్ తో ఫోన్లో మాట్లాడుతూ ఏడుస్తుంది శ్వేత. అడిగినంత డబ్బులు ఇవ్వలేనని, టార్చర్ చేస్తే చనిపోతానని అంటుంది. అది చూసిన చంద్రకళ అసలు మీ సమస్య ఏంటీ అని అడుగుతుంది. చంద్రను పట్టుకొని ఏడ్చేసిన శ్వేత.. ప్రమోద్ తో లవ్ గురించి చెప్తుంది. విరాట్ కు బ్రేకప్ చెప్పి, ప్రమోద్ తో లివిన్ రిలేషన్ షిప్ స్టార్ట్ చేశా. వాడు సీక్రెట్ గా ఫొటోలు, వీడియోలు తీసి డబ్బు కోసం బెదిరించడమే వాడి పని. నెట్ లో పెడతానని చెప్పి డబ్బులు అడుగుతూనే ఉ...