Hyderabad, అక్టోబర్ 11 -- నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో అంతా నచ్చజెప్పడంతో పంతులు దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది జగదీశ్వరి. తర్వాత విరాట్‌ను భోజనానికి రమ్మని చంద్ర అడిగితే.. రానంటాడు. నువ్వు అజాగ్రత్తగా ఉండి చేస్తున్నావో. నీ టైమ్ అలా ఉందో. నిన్ను అందరు అంటే ఏం చెప్పాలో తెలియక ఉండిపోతున్నా అని విరాట్ బాధపడుతాడు.

స్నేహం ఉన్నన్ని రోజులు తప్పులు కనిపించవు. అదే పోతే అన్ని తప్పులు కనిపిస్తాయి. ఇప్పుడు శ్యామల గారు అదే చేస్తున్నారు. ఆవిడ ఏం చేసిన ఇంటి మంచి కోసమే. మనం నిజాయితీగా ఉంటే అదే కాపాడుతుందని చంద్రకళ అంటుంది. కానీ, గడువు ముగిసిపోతుంది. ఆలోపు నాన్న కోలుకుంటారో లేదో అని భయంగా ఉందని విరాట్ అంటాడు.

అందుకు దిగులుపడాల్సిన అవసరం లేదని క్రాంతి వస్తూ అంటాడు. డాక్టర్ వైశాలి అని ఫేమస్ న్యూరో సర్జన్. అమెరికా నుంచి వస్తున్నారు. నా ఫ్రెండ్ ఆమెతో ...