భారతదేశం, అక్టోబర్ 1 -- నిన్ను కోరి సీరియల్ టుడే అక్టోబర్ 1వ తేదీ ఎపిసోడ్ లో పొద్దున చంద్రకళ తులసి కోటకు పూజ చేస్తుంది. మా బంధం శాశ్వతం కావాలి, మా మధ్య ఏ కొత్త సమస్య రాకూడదని చంద్ర మొక్కుతుండగా, లాగేజీ బ్యాగ్ తో శ్వేత వస్తుంది. ఎవరని అడుగుతుంది చంద్ర. విరాట్ కోసం వచ్చానని శ్వేత చెప్తుంది.

అన్నయ్య శ్వేత, అదే అమ్మ అన్నయ్య ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అని క్రాంతి కంగారుగా చెప్తాడు. విరాట్ కోపంగా వచ్చి గుమ్మం బయటే ఆగమని అంటాడు. నీ బిజినెస్ డల్ అయిందని శ్వేత బ్రేకప్ చెప్పిన విషయాన్ని విరాట్ గుర్తు చేసుకుంటాడు. చంద్రను లోపలికి రమ్మంటాడు. ఎవరు బావ తను అని అడుగుతుంది చంద్రకళ. నా జీవితంలోని చేదు అనుభవమని విరాట్ అంటాడు. అన్నయ్య ఎక్స్ లవర్ అని చంద్రకు క్రాంతి చెప్తాడు.

నీ విషయంలో తప్పు చేశానని బాధ పడని రోజు లేదని శ్వేత అంటుంది. నీ వల్ల వాడు బాధ పడని రోజు ల...