భారతదేశం, ఆగస్టు 25 -- లవ్ లైఫ్ గురించి బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ చేసిన తాజా కామెంట్లు తెగ వైరల్ గా మారాయి. నిజమైన ప్రేమ గురించి ఈ స్టార్ హీరో చెప్పిన మాటలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. బిగ్ బాస్ 19వ సీజన్ ప్రీమియర్ సందర్భంగా సల్మాన్ ఖాన్ ప్యూర్ లవ్ పై చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా మారాయి.

ఆదివారం (ఆగస్టు 24) రాత్రి బిగ్ బాస్ 19 సీజన్ స్టార్ట్ అయింది. ఈ రియాలిటీ షో గ్రాండ్ గా ప్రీమియర్ అయింది. ఈ సీజన్ తో సల్మాన్ ఖాన్ హోస్ట్ గా తిరిగి ఎంట్రీ ఇచ్చాడు. కంటెస్టెంట్లను ఇంట్రడ్యూస్ చేశారు. ఈ క్రమంలోనే కంటెస్టెంట్ తాన్యా మిట్టల్ తో జరిగిన సంభాషణలో ఆయన తన ప్రేమ జీవితం గురించి ఓపెన్ గా మాట్లాడాడు. సల్మాన్ వ్యక్తిగత విషయాలు చెప్పాడు. కల్ట్ హిట్ 'గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్' చిత్రానికి స్క్రీన్ రైటర్ గా తన కెరీర్ ను ప్రారంభించిన జైషాన్ క్...