Hyderabad, ఆగస్టు 25 -- మలయాళం నటి స్వాసిక ఇటీవల తన రాబోయే మలయాళం మూవీ 'వాసంతి' ప్రమోషన్ సందర్భంగా మీడియాతో మాట్లాడింది. ఈ సినిమా ఆగస్టు 28 నుండి మనోరమ మ్యాక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. 33 ఏళ్ల ఈ నటి తనకు చిన్న వయసులోనే తల్లి పాత్రలు ఆఫర్ చేశారని, అందులో 40 ఏళ్ల రామ్ చరణ్ తల్లి పాత్ర కూడా ఉందని చెప్పడం గమనార్హం. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'పెద్ది' మూవీలో ఈ పాత్ర కోసం తనను సంప్రదించినట్లు ఆమె చెప్పింది.

పెద్ది మూవీని రిజెక్ట్ ఎందుకు చేయాల్సి వచ్చిందో స్వాసిక ఈ ఇంటర్వ్యూలో వెల్లడించింది. మలయాళేతర సినిమాలలో పాత్రలు ఎంచుకునే విషయంలో సెలెక్టివ్‌గా ఉంటున్నారా అని అడిగినప్పుడు.. ఆమె తనకు ఇటీవల చాలా సినిమాలలో తల్లి పాత్రల ఆఫర్ వచ్చినట్లు వెల్లడించింది. "నాకు పదే పదే తల్లి పాత్రలను అడిగారు. కానీ నన్ను ఎక్కువగా షాక్ కు గురి చేస...