భారతదేశం, జనవరి 22 -- అనిల్ రావిపూడి తన సినిమాలతోనే కాదు తన కామెంట్స్, తన సినిమాలకు ప్రమోషన్లతోనూ ప్రేక్షకులను నవ్విస్తాడు. తన నెక్ట్స్ సినిమా గురించి చెబుతూ అతడు అలాంటి కామెంట్సే చేశాడు. మన శంకరవరప్రసాద్ గారు మూవీ సక్సెస్ మీట్ లో మాట్లాడిన అనిల్.. తన పదో సినిమా టైటిల్ చాలా క్రేజీగా ఉంటుందంటూ హింట్ ఇచ్చాడు.

టాలీవుడ్ లో అనిల్ రావిపూడి ఇప్పటి వరకూ పట్టిందల్లా బంగారమే. హిట్ మెషీన్ గా, అందులోనూ సంక్రాంతి బ్లాక్‌బస్టర్ల మాస్టర్ గా పేరుగాంచాడు. దీంతో వచ్చే ఏడాది సంక్రాంతికి మరో సినిమాతో రాబోతున్నాడు. తాజాగా మన శంకరవరప్రసాద్ గారు సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా అతడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

"నా పదో సినిమా టైటిల్ ఫిక్స్ అయిపోయా.. చాలా విచిత్రమైన టైటిల్ అది.. హీరో ఎవరు అనేది ఇంకా ఫిక్స్ చేయలేదు. టైటిల్ అనౌన్స్‌మెంట్ నుంచి వీడు మళ్లీ మొదలుప...