భారతదేశం, డిసెంబర్ 16 -- నటుడు, తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత దళపతి విజయ్ గురించి అతని తండ్రి, సినీ నిర్మాత ఎస్.ఏ. చంద్రశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తనయుడి సినీ, రాజకీయ జీవితంపై మాట్లాడారు. సామాజిక స్పృహతో కూడిన చిత్రాల్లో నటించడం కొడుకు కెరీర్ మార్పునకు కారణమని ఆయన పేర్కొన్నారు.

చెన్నైలో బిహైండ్‌వుడ్స్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో చంద్రశేఖర్ మాట్లాడుతూ, నటనకే పరిమితమై ఉంటే తన కుమారుడు ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించగలిగేవాడని అన్నారు. చంద్రశేఖర్ తన కుమారుడు దళపతి విజయ్ గురించి మాట్లాడటం ప్రారంభించగానే, ప్రేక్షకుల కేరింతలు ఎంతగా పెరిగాయంటే వారిని శాంతపరచడానికి కొంత సమయం ఇవ్వాల్సి వచ్చింది.

''మా అబ్బాయి విజయ్ - సాధారణంగా జీవితంలో డబ్బు మాత్రమే ఉందని నమ్మేవాడు కాదు. అలా అనుకుంటే అతను సులభంగా నటించి, చాలా డబ్బు సంపాదించగలడు. నేను మీ టీవీకే న...