భారతదేశం, ఫిబ్రవరి 25 -- బాలీవుడ్ ప్రముఖ నటుడు అనిల్ కపూర్ తన రాబోయే యాక్షన్ మూవీ 'సుబేదార్' (Subedaar)తో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. ఈ మధ్యే జరిగిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో అనిల్ చెప్పిన ఓ విషయం నవ్వు తెప్పించేలా ఉంది. ఒక నటుడిగా తనకు బయట ఎంత భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ, తన సొంత ఇంట్లో మాత్రం తన కుటుంబ సభ్యులు ఎవరూ తనకు ఫ్యాన్ కాదని అతడు నవ్వుతూ వెల్లడించాడు.

తన వృత్తిపరమైన విజయాల్లో తన భార్య సునీతా కపూర్ పాత్ర ఎంత కీలకమో అనిల్ కపూర్ ఎన్నోసార్లు బహిరంగంగా చెబుతుంటాడు. ఈ 'సుబేదార్' మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో అతడు మాట్లాడుతూ.. తన భార్య తనను ఎంత సాధారణమైన వ్యక్తిగా ఉంచుతుందో సవివరంగా చెప్పాడు.

"నా ఇంట్లో నాకు ఎవరూ ఫ్యాన్స్ లేరు. ఈరోజు నేను ఈవెంట్ కోసం ఇంటి నుంచి బయలుదేరుతున్నప్పుడు, ట్రైలర్ లాంచ్ కో...