భారతదేశం, జనవరి 26 -- విజయ్ సేతుపతి తన నెక్ట్స్ మూవీ 'గాంధీ టాక్స్' ప్రచారంలో భాగంగా 'ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో'లో సందడి చేయబోతున్నాడు. అతనితో పాటు ఆ సినిమా సహ నటులు అదితి రావు హైదరీ, సిద్ధార్థ్ జాదవ్, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు. రాబోయే ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ఒక వీడియో బయటకు వచ్చింది. అందులో విజయ్ సేతుపతి తాను ఎందుకు నటుడిని అయ్యానో చెప్పిన విధానం నవ్వు తెప్పించింది.

ఆ వీడియోలో కపిల్ శర్మ.. విజయ్ సేతుపతిని ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడిగాడు. "మీరు ఎప్పుడైనా ఏదైనా యాక్టింగ్ స్కూల్ కు వెళ్ళారా అని ప్రశ్నించాడు. దానికి విజయ్ బదులిస్తూ.. తాను ఎప్పుడూ వెళ్లలేదని, దానికి బదులుగా ఒక నాటక బృందంలో లెక్కలు రాసే అకౌంటెంట్ గా పనిచేశానని చెప్పాడు.

అప్పుడు కపిల్ శర్మ.. "మీరు అక్కడ పని చేస్తున్నప...