Hyderabad, సెప్టెంబర్ 17 -- తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ సుందరకాండ జియోహాట్‌స్టార్ లో డిజిటల్ ప్రీమియర్ కానుంది. ఈ సినిమా ఆగస్టు 27న థియేటర్లలో రిలీజ్ కాగా.. నెల రోజుల్లోపే ఓటీటీలోకి వస్తోంది. మరి ఈ మూవీ స్ట్రీమింగ్ వివరాలు ఇక్కడ చూడండి.

వెంకటేశ్ నిమ్మలపూడి డైరెక్షన్ లో నారా రోహిత్ నటించిన మూవీ సుందరకాండ. ఈ సినిమా సెప్టెంబర్ 23 నుంచి జియోహాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. "ఏ రెండు లవ్ స్టోరీలు ఒకేలా ఉండవు.

సుందరకాండ మూవీని సెప్టెంబర్ 23 నుంచి కేవలం జియోహాట్‌స్టార్ లో చూడటానికి రెడీగా ఉండండి" అనే క్యాప్షన్ తో ఆ ఓటీటీ ట్వీట్ చేసింది. దీనికి మూవీ పోస్టర్ కూడా యాడ్ చేసింది. ఇందులో సినిమాలో మూడు లీడ్ క్యారెక్టర్స్ ను చూడొచ్చు.

నారా రోహిత్ నటించిన లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ ఫ్యామిలీ మూవీ సుందరకాండ. ఈ సినిమాతో శ్రీదేవి విజయ్ కుమార్ చాలా ...