భారతదేశం, జూలై 29 -- పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'హరి హర వీరమల్లు' (Hari Hara Veera Mallu) మూవీ కలెక్షన్లు మరింత పడిపోయాయి. సినిమా రిలీజ్ అయ్యాక వచ్చిన ఫస్ట్ మండే (జులై 28) ఈ ఫిల్మ్ కలెక్షన్లు దారుణంగా ఉన్నాయి. జులై 24న థియేటర్లలో ఈ సినిమా రిలీజైంది. అయిదు రోజుల్లో ఈ మూవీ ఎన్ని కోట్లు రాబట్టిందో ఇక్కడ చూద్దాం.

హరి హర వీరమల్లు గత గురువారం థియేటర్లలో రిలీజైంది. అంతకంటే ఒక్క రోజు ముందు బుధవారం ప్రీమియర్లు వేశారు. ఈ మూవీ రిలీజయ్యాక వచ్చిన ఫస్ట్ మండే ఇండియాలో రూ.2.25 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టిందని సక్నిల్క్ ట్రేడ్ వెబ్ సైట్ వెల్లడించింది. దీంతో కలిసి ఈ పవన్ కల్యాణ్ సినిమా అయిదు రోజుల్లో ఇండియాలో రూ.77.50 కోట్ల నెట్ కలెక్షన్లు సొంతం చేసుకుంది.

ఓపెనింగ్ వీకెండ్ తో పోలిస్తే హరి హర వీరమల్లు సినిమా వసూళ్లు తగ్గినప్పటికీ వీక్ డేస్ ను పరిగణనలోకి తీసుక...