భారతదేశం, సెప్టెంబర్ 27 -- తన కెరీర్ లో ఎన్నో వైవిధ్యభరితమైన క్యారెక్టర్లు ప్లే చేశారు మోహన్ బాబు. విలనిజం పండించారు. హీరోగా మెప్పించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ అదరగొట్టారు. కానీ రీసెంట్ టైమ్ లో ఆయనకు తగ్గ పాత్ర, సినిమా దక్కలేదనే చెప్పాలి. ఇప్పుడు మరోసారి విలన్ గా తనలోని క్రూరత్వాన్ని చూపించేందుకు రెడీ అయిపోయారు కలెక్షన్ కింగ్. నాని హీరోగా వస్తున్న ది ప్యారడైజ్ మూవీలో ఆయనే విలన్.

విలన్ గా మెగాస్టార్ చిరంజీవి లాంటి అగ్ర నటులను ఢీ కొట్టిన మోహన్ బాబు యాక్టింగ్ లో తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. ఎన్నో ఐకానిక్ క్యారెక్టర్లు ప్లే చేశారు. ఇప్పుడు మరోసారి విలనిజం పండించడానికి రెడీ అయ్యారు. నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న ప్యారడైజ్ మూవీలో మంచు మోహన్ బాబు విలన్. ఈ విషయాన్ని ఇప్పటికే ఆయన కూతురు మంచు లక్ష్మీ ఓ మూవీ ప్రెస్ మీట్ లో న...