Hyderabad, అక్టోబర్ 6 -- టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎప్పుడు కొత్త కొత్త హీరోయిన్లు ఎంట్రీ ఇవ్వడం సర్వసాధారణమే. ఇప్పటికీ తెలుగులోకి ఎంతోమంది ముద్దుగుమ్మలు హీరోయిన్స్‌గా డెబ్యూ చేసి అలరించారు. తాజాగా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఇద్దరు ముద్దుగుమ్మలు ఒకే సినిమాతో హీరోయిన్స్‌గా డెబ్యూ ఎంట్రీ ఇవ్వనున్నారు.

వారే ఐరా, సాఖి. టాలీవుడ్ నటుడు, 30 వెడ్స్ 21 యూట్యూబ్ సిరీస్ ఫేమ్ చైతన్య రావు మయసభ, ఘాటి తర్వాత చేస్తున్న కొత్త సినిమాలో ఈ ఇద్దరు హీరోయిన్స్‌గా పరిచయం కానున్నారు. శ్రేయాస్ చిత్ర, పూర్ణా నాయుడు ప్రొడక్షన్స్ బ్యానర్ల మీద పూర్ణా నాయుడు, శ్రీకాంత్. వి ప్రొడక్షన్ నెంబర్ 5గా ఈ సినిమాను ప్రారంభించారు.

ఈ మూవీకి క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించారు. ఇటీవల ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. డైరెక్టర్ దేవ కట్టా క్లాప్ కొట్టి ప్రారంభించిన ఈ సినిమా లాంచ్ ...