Hyderabad, ఆగస్టు 13 -- నటి సుస్మితా సేన్ తన రీఎంట్రీ కోసం నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, హాట్‌స్టార్‌లో ఉన్న వాళ్లకి ఫోన్ చేసి పని అడిగానని చెప్పిన ఒక పాత క్లిప్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే మాజీ మిస్ యూనివర్స్, మంచి నటిగా పేరుగాంచిన సుష్మిత ఇలా ఓపెన్ గా పని గురించి అడిగిన విషయం చెప్పడాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

నిజానికి సుష్మితా సేన్ కు చెందిన వీడియో రెండేళ్ల కిందటిది. అయితే ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2023లో మిడ్‌డే ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుస్మితా తన కమ్‌బ్యాక్ గురించి మాట్లాడింది. ఆ ఇంటర్వ్యూలోని ఒక చిన్న క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఆమె పని కోసం తాను స్వయంగా ఫోన్ చేసి అడిగినట్లు చెప్పింది. అయితే అభిమానులు ఆమె నిజాయితీకి ఫిదా అయ్యారు.

"నేను నెట్‌ఫ్లిక్స్,...