భారతదేశం, జనవరి 25 -- నాంపల్లి అగ్రిప్రమాద ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శనివారం మధ్యాహ్నం ఘటన జరగగా. అప్పట్నుంచి నిరంతరంగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. పోలీసు, అగ్నిమాపక శాఖ సిబ్బందితో పాటు ఎన్టీఆర్ఎఫ్ బృందాలు ఈ ఆపరేషన్ లో నిమగ్నమయ్యాయి.

రెస్క్యూ ఆపరేషన్ కు దట్టమైన పొగ ఆటంకంగా మారింది. భవనంలో చిక్కున్న ఐదుగురిని గుర్తించేందుకు రెస్క్యూ టీంలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. సెల్లార్‌ అంతా ఫర్నీచర్‌ పరిచి ఉండటంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

భవనం లోపల చిక్కిపోయిన ఐదుగురిలో. సెల్లార్‌లో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. వెంటనే మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు. మరో ముగ్గురి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

లోపల దట్టంగా పొగ ఉండటంతో లోపలకు వెళ్లడం కష్టమవుతున్నదని సహాయక బృందాలు చెబుతున్నాయి. భారీ అగ్నిప్రమాదం నేపథ్యంలో. లోపల చిక...