Hyderabad, సెప్టెంబర్ 25 -- నవరాత్రులు మొదలైపోయాయి. తొమ్మిది రోజులు పాటు అమ్మవారిని తొమ్మిది రూపాలలో పూజిస్తూ వుంటారు. ప్రతి రోజు వివిధ రకాల నైవేద్యాలను సమర్పిస్తారు. ఈరోజు దసరా నవరాత్రుల్లో నాల్గవ రోజు. నాలుగవ రోజు కాత్యాయనీ దేవి పూజించాలి.

దేవీ మహాత్మ్యంలో దుర్గామాత తొమ్మిది రూపాలలో ఒక రూపం కాత్యాయనీ దేవి. పురాణాల ప్రకారం ఈ అవతారం మహర్షి కాత్యాయనుడు చేసిన దీర్ఘ తపస్సు ఫలితంగా ప్రత్యక్షమైంది. అశుభ శక్తుల వినాశనం, సత్యధర్మాల స్థాపన కోసం శక్తి స్వరూపిణి కాత్యాయనీ అవతరించింది.

మహిషాసురుడు అనే రాక్షసుడు లోకాలను జయించి, దేవతలను తరిమికొట్టాడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అతని మీద యుద్ధం చేయలేకపోయారు. అప్పుడు వారి శక్తులన్నిటినీ సమన్వయించి కాంతిరూపిణిగా కాత్యాయనీని సృష్టించారు. మహర్షి కాత్యాయనుని ఆశ్రమంలోనే ఆమె అవతరించిందని చెప్పబడుతుంది. అందు...