భారతదేశం, అక్టోబర్ 12 -- దసరా నవరాత్రులు చాలా విశేషమైన, పవిత్రమైన రోజులు. ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని ప్రత్యేకంగా ఆరాధిస్తారు. ఈ తొమ్మిది రోజుల్లో దుర్గాదేవి తొమ్మిది రూపాల్లో పూజలు చేస్తారు. అమ్మవారికి నైవేద్యాలు సమర్పిస్తారు.

ఒక్కో రోజు ఒక్కో అమ్మవారి రూపంలో అలంకరణ చేసి, పూలను సమర్పించి, మంత్రాలను జపించాలి. హిందూ సంప్రదాయంలో ఈ నవరాత్రులు చాలా విశేషమైనవి. నవరాత్రుల్లో అమ్మవారికి ఏ పూలను సమర్పించాలి? ఎలాంటి పరిహారాలను పాటించాలి? ప్రతి రోజూ చదువుకోవాల్సిన మంత్రాలు ఏవనేవి ఇప్పుడు తెలుసుకుందాం.

అమ్మవారి పూజలో పూలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఎర్రటి మందారాలు, గులాబీలు, బంతిపూలు, తామర పూలు ఇలా రకరకాల పూలతో అమ్మవారిని ఆరాధించడం మంచిది. ఒక్కో అమ్మవారి రూపానికి సమర్పించే పూలు ప్రాంతీయ సంప్రదాయాన్ని బట్టి మారొచ్చు.

తెల్లటి పూలు: కొన్ని దేవతా ర...